హైదరాబాద్ : క్రీడల్లో హైదరాబాద్‌ను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. నేడు నిర్వహించిన మారథాన్‌లో గెలిచిన వారికి గచ్చిబౌలీ స్టేడియం లో జరిగిన కార్యక్రమం లో రన్నర్స్‌కు ఆయన మెడల్స్ అందించారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిఖత్ జరీన్, సిరాజ్‌లకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పునర్ వైభవం తీసుకొస్తుందని చెప్పారు రేవంత్.
హైదరాబాద్‌లో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం వచ్చే ఏడాదిలోగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలిపామన్నారు.
- Advertisement -