చేర్యాల – . సమాజంలో రైతు బాగుంటే, అతనే అందరినీ ఆదుకుంటాడని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.2000 పెన్షన్ ఇస్తుంటే తాను ముక్కు నేలకు రాస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణా ఎన్నికల ప్రచారంలో. చేర్యాల లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ టి పి సి సి చీఫ్ రేవంత్. రెడ్డి నీ, , కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తనదైన శైలిలో మండిపడ్డారు. . రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేసీఆర్”నిన్న జనగామకొచ్చి ఒకరు ఒర్రిఒర్రి పోయిండట. కుక్కలు బాగా ఒర్రుతాయని తిట్టిపోశారు. పిచ్చి కుక్కలను పట్టించుకుంటామా అని ప్రశ్నించారు. ఉద్యమంలో రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులపై వెళ్ళిన రేవంత్ రెడ్డిని అప్పటి నుంచి రైఫిల్‌రెడ్డి అంటున్నారని అన్నారు.తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఆంధ్రోళ్ల బూట్ల కాడ ఉన్నోడు ఇప్పుడు మాట్లాడతారా?” అని మండిపడ్డారు
తాము పెన్షన్ రూ.2000లు ఇస్తున్నామని, మళ్ళీ గెలిస్తే దానిని రూ.5000లకు తీసుకెళ్తామన్నారు. ఓట్ల కోసం తాము అబద్దాలు చెప్పలేమని, తాము చేయగలిగేది మాత్రమే చెప్తామని అన్నారు. తమకు ఓ పద్ధతి ఉందని, ఆ పద్ధతి ప్రకారమే హామీలు ఇస్తున్నామని తెలిపారు. రైతుల కోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, పాలసీల కారణంగానే రైతులు ఇప్పుడిప్పుడే అప్పుల బారినుంచి కాస్త బయటపడుతున్నారన్నారు.ఇంకో పది పదిహేనేళ్ళు ఇలానే ఉంటే.. రైతులు సంపన్నులవుతారని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ మనసుకు తృప్తి ఉంది నాకు. చేర్యాలకు వస్తే సొంత ఊరికి వచ్చినట్లు అనిపించింది. మంచిగా ఆనందంగా మాట్లాడుకున్నం. మల్లన్న సాగర్ 50 టీఎంసీల ప్రాజెక్టు నిండుకుండలా మన నెత్తిమీదనే ఉన్నది. టప్పాస్‌పల్లి రిజర్వాయర్‌కు రూ. 350 కోట్లు మంజూరు చేశాం. ఆ కాలువ, పైప్‌లైన్ పూర్తవుతుంది. అది పూర్తయితే బ్రహ్మాండంగా నీళ్లు వస్తయ్. చేర్యాల ఏరియాలో కరువు అనేది అడుగుపెట్టకుండా కంట్రోల్ చేసే బాధ్యత నాది. దేవాదుల వస్తుంది. రంగనాయక సాగర్ నీళ్లు ధూళిమిట్టకు వస్తున్నయ్. అదే విధంగా మల్లన్నసాగర్ నుంచి వస్తయ్. మొత్తం నీళ్లే నీళ్లు ఉండే పరిస్థితి చేర్యాలకు రాబోతున్నది’ అని సీఎం కేసీఆర్ అన్నారు
.ప్రజా స్వామ్య పరిణతి చెందిన అమెరికా వంటి అగ్రదేశాల్లో ఎన్నికల ప్రచారాలను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ భారత్ లోనూ మార్పులు వస్తున్నాయని, ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని పేర్కొన్నారు.మన దగ్గర ఎన్నికలు వస్తే నేరాలు, ఘోరాలు, అభాండాలు పుట్టుకు వస్తాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరో ఏమో చెప్తే నిర్ణయాలు తీసుకోవద్దని, ఆచి తూచి నిర్ణయాలను తీసుకోవాలని పేర్కొన్నారు.ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీ చరిత్రను కూడా పరిశీలించాలని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వచ్చిందే తెలంగాణా కోసమని పేర్కొన్న కేసీఆర్, ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు.