Tuesday, November 26, 2024

Target BRS – ఎంపి కొత్త‌, ఎమ్మెల్యేలు పైళ్ల‌, మ‌ర్రి ఇళ్లు,కార్యాల‌యాల‌లో 8 గంటలుగా ఐటి సోదాలు..

తెలంగాణ లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు టార్గెట్ ఈ దాడులు కొన‌సాగుతున్నాయి . బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఉదయం 6గంటల నుంచి మొత్తం 60 బృందాలతో ఐటీ అధికారులు 60 వేర్వేలు ప్రాంతాల‌లో ఏక‌కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్‌రెడ్డి ఇల్లు, వ్యాపార కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్‌లో మాల్స్‌లోనూ , మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసం, కార్యాలయాలపైనా ఐటీ అధికారుల త‌నిఖీలు జ‌రుపుతున్నారు..

భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల నివాసంలో..

భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్‌రెడ్డి నివాసం ఉంటున్న‌. కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీలోని ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫైళ్ల శేఖర్ రెడ్డి తీర్థ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్ ఎనర్జీ, లిథియం బ్యాటరీల వ్యాపారాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కర్ణాటక‌లో పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను తీర్థ గ్రూప్ పూర్తి చేసింది. సౌత్ ఆఫ్రికా‌లో మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఐటీ అధికారులు హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోకూడా సోదాలు చేస్తున్నారు. ఈ రెండు కంపెనీలకు డైరెక్టర్‌గా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భార్య వనితా కొనసాగుతున్నారు. ఐటీ అధికారులు ఏక కాలంలో 12చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. ఇన్‌కంట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. తీర్థ గ్రూప్‌కి ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ డైరెక్టర్లుగా ఉన్నారు.. అలాగే అంత‌కు ముందు పైళ్ల మావ‌య్య మోహ‌న్ రెడ్డి గ్రామం లోనూ అధికారులు త‌నిఖీలు జ‌రిపారు.. అక్క‌డ దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా పైళ్ల నివాసంలో సోదాల‌కు దిగాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement