సూర్యాపేట, ప్రభన్యూస్ : జిల్లాలో వానాకాలం 2021-22కు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలంలో రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. గత 15 రోజుల క్రితం జిల్లాలో ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. జిల్లాలో 5,525 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గాను జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో 333 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే 169 ఐకేపీ కేంద్రాలు 118 పీఏసీఎస్ కేంద్రాలు మొత్తం 287 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. మిగిలిన 37 ఐకేపీ, 9 పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అవసరమైన చోట ప్రారంభించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రారంభించి 169 ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో 130 కేంద్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభంగా 118 పీఏసీఎస్ కేంద్రాలలో 42 కేంద్రాలలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
మొత్తం పీఏసీఎస్, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గత 15 రోజులుగా 15,817 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం కేవలం 2391 మెట్రిక్ టన్నులు కాంటాలు కావాల్సి ఉన్నవి. ఇప్పటికే ఐకేపీ కేంద్రాలలో ధాన్యం విక్రయించి 1645 మంది రైతులకు గాను 70 మంది రైతులకు ప్రభుత్వం రూ. 12,97,2408 చెల్లించగా, పీఏసీఎస్ కేంద్రాలలో ధాన్యం విక్రయించి 757 మంది రైతులకు గాను 72 మంది రైతులకు 94,07,396 చెల్లించింది. 75 రోజుల ప్రణాళికలో ప్రభుత్వం జిల్లాలో ప్రతి గింజను కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital