ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా.. ఇష్టమున్నట్టు బండ్లను రోడ్లమీదికి తెస్తే పెద్ద మొత్తంలో ఫైన్‌తోపాటు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్ టాంపరింగ్‌కు పాల్పడుతున్న వారిని పట్టుకుని ఫైన్ వేశారు. ఫైన్ నుంచి తప్పించుకునేందకు.. సీసీ కెమెరాలకు, ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా ఉండేదుకు కొంతమంది అతి తెలివి ప్రదర్శిస్తున్నారని, ఇట్లా చేయడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఖమ్మం ట్రాఫిక్ సీఐ అంజలి చెప్పారు. ఇవ్వాల (గురువారం) ఖమ్మం సిటీలోని పలు సెంటర్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఖమ్మ సిటీలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఇ- చలాన్ నుండి తప్పించుకొవలని కొంతమంది తప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్, నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 30 వాహనాలకు ఫైన్ విధించినట్లు ట్రాఫిక్ సీఐ అంజలి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన సందర్భంగా సీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల ఒరిజినల్ రిజిస్ట్రేషన్ నెంబర్ కు బదులు మార్పిడి చేసి తిరుగుతున్నవాటిని గుర్తించి ఈ-చలానాల ద్వారా/ఫైన్ విధించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ- చాలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనాలపై దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు ఖమ్మం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీసీ కెమెరాలలో అయా వాహనాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నెంబర్ ప్లేట్ మార్చడం, బైక్ నెంబర్ కనబడకుండా వంకరగా పెట్టడం లేదా కట్ చేయడం వంటి తప్పుడు పనులు చేస్తే సరికాదన్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.