Friday, November 22, 2024

సామాన్యుల‌కు అందుబాటులో ట‌మాట – మార్కెట్ లో రూ.50 కే ల‌భ్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: సామాన్య, పేదలకు శుభవార్త. నిన్న మొన్నటి వరకు బెంబేలెత్తించిన టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు చోట్ల రూ 50 నుంచి 65కి లభిస్తోంది. ఒకటి రెండు రోజులుగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు టమాట పంట రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. పది రోజుల కిందట పరిస్థితులు చూస్తే .. హైదరాబాద్‌కు 850 క్వింటాళ్ల టమాట మాత్రమే వచ్చింది. కానీ సోమవారం, మంగ‌ళ‌వారాల‌లో అయిదు వేల క్వింటాళ్ల టమాట హోల్‌సేల్‌ మార్కెట్‌కు వచ్చింది. ఏపీ, కర్ణాటక నుంచి అధికంగా టమాట హైదరాబాద్‌కు వస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు- చుట్టు-పక్కల ప్రాంతాల్లోని జిల్లాల నుంచి కూడా టమాట ఎక్కువగానే వస్తోంది. ఫలితంగా దిగి వచ్చింది.

ఆగస్టు నెలాఖారు నాటికి కిలో ధర 40కు తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే టమాట ధరలు తగ్గినా ఇతర నిత్యవసర సరుకుల ధరలు ఇంకా ఆకాశ్నంటుతున్నాయి. వంటనూనె, బియ్యం, గోధుమలు, కందిపప్పు ధరల పెరుగుదలు భారీగా పెరిగాయి. కిలో పచ్చిమిర్చి ధర రూ. 120- 140 మధ్య ఉంది. ఏ మాత్రం దిగి రావటం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement