Friday, November 22, 2024

కృత్రిమ గర్భధారణలో మొదటి స్థానంలో తెలంగాణ

నాణ్యమైన మేలుజాతి పాడి పశుసంవద వృద్ధి కోసం చేపట్టిన కృత్రిమ గర్భధారణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ, పాల ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులను నిర్వహించాలన్నారు. నట్టల నివారణ మందు పంపిణీ, టీకాల పంపిణీ, ఉచిత పశు వైద్య శిబిరాల నిర్వహణ వంటి కార్యక్రమాలలో గోపాలమిత్రల సేవలను వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.

రాయితీపై పాడి గేదెల పంపిణీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న డీడీల విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు తీసుకుకోవల్సిన చర్యలపై పశుసంవర్థక, డెయిరీ, వెటర్నరీ అధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అధ్యాయన నివేదికను సమర్పించాలని పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ ఎస్‌. రామచందర్‌ను మంత్రి తలసాని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement