Monday, July 1, 2024

Talks Hold – పురోగ‌తి లేని చ‌ర్చ‌లు… కొన‌సాగుతున్న జూడా ల స‌మ్మె

పలు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌ని కోరుతూ నేటి నుంచి స‌మ్మె ప్రారంభించిన జూనియ‌ర్ డాక్ట‌ర్స్ ప్ర‌తినిధుల‌తో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. ఈ క్రమంలోనే సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడాలు వెల్లడించారు.

ఇంకా చాలా అంశాలపై క్లారిటీ రాలేదని జూడాలు అంటున్నారు. కొన్ని డిమాండ్స్‌పైన సానుకూలంగా స్పందించినప్పటికీ సమ్మెను విరమించేది లేదని జూడాలు తేల్చి చెప్పారు. పూర్తి స్థాయిలో తమ డిమాండ్స్‌పై స్పందించి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని జూడాలు అంటున్నారు. సమ్మెపై రాష్ట్ర స్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అప్పటి వరకు సమ్మె యధాతధంగా కొనసాగిస్తామని జూడాలు వెల్లడించారు.

- Advertisement -

స్టైఫండ్‌కి గ్రీన్ ఛానల్ పై మారో మారు చర్చించి నిర్ణయిస్తామని మంత్రి తెలిపారని జూడాలు పేర్కొన్నారు. కాకతీయ వర్శిటీలో రోడ్‌లు సహా హాస్టల్ ఏర్పాట్లపై ఇప్పటికే ఫైనాన్స్ శాఖకు పంపామన్నారు. వైద్యుల భద్రత గురించి ఇప్పటివరకు ఎలాంటి చర్చా జరగలేదని, దానిపై ఆలోచిస్తామని అన్నారని జూడాలు తెలిపారు. కొత్త మెడికల్ కాలేజీలకు బస్ ఏర్పాట్లపై డీఎంఈ నిర్ణయం తీసుకోవాలని మంత్రి తెలిపారన్నారు. డీఎంఈని కలిసి ఈ అంశంపై చర్చిస్తామన్నారు. ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లింపు, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం, వైద్యకళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనే పలు డిమాండ్లతో జూనియర్‌ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement