Friday, November 22, 2024

Delhi: రోడ్ల రిపేర్లు త్వరగా చేపట్టండి.. కేంద్రమంత్రి గడ్కరీకి టీఆర్‌ఎస్ ఎంపీల వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతిగతిన చేపట్టాలని టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కలిశారు. ఈ మేరకు కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నెక్కొండ నుంచి నెల్లికుదురు వరకు ఉన్న ఆర్అండ్‌బీ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరారు. భద్రాచలంలో గోదావరి నదిపై నిర్మించే రెండో వంతెన పనులను త్వరగా పూర్తి చేయాలని, భద్రాచలం నుండి ఏటూరునాగారం వరకు నిర్మించిన 106 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారికి సంఖ్య ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీల వినతిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement