Friday, November 22, 2024

తెలంగాణలో ఎరువుల కొరతపై చర్యలు చేపట్టండి.. కేంద్రానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా రాష్ట్రంలో ఎరువుల కొరతపై చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఈ అంశాన్ని లోక్‌సభ జీరో అవర్‌లో లేవనెత్తారు. రాష్ట్ర రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సౌకర్యాలు కల్పించారని, గడిచిన రెండేళ్లుగా తెలంగాణలో 10 రేట్లు వ్యవసాయం సాగు పెరిగిందని ఆయన ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పంటలు సాగు చేసే సమయమని, రైతులు ఎరువుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఎరువుల కోసం సాగు పనులు వదులుకొని రైతులు క్యూ లైన్లలో ఎదురుచూస్తున్నారని తెలిపారు. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు చర్చలు జరిపితే ఒక లక్ష టన్నుల ఎరువుల కొరత ఉందని తేలిందని, అసలు రాష్ట్రంలో ఎందుకు ఎరువుల కొరత ఏర్పడిందని ఎంపీ ప్రశ్నించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం భారత్‌పై ఉండదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మూడు నెలలుగా ఎరువుల కొరత ఉందని, ఎరువులు దొరక్క రైతులు ఆవేదనలో ఉన్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement