ఏర్గట్ల, (ప్రభన్యూస్): ఏర్గట్ల మండలం తడపాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాహిత్య పరంగా మరో సారి జాతీయస్థాయిలో రాణించి బహుమతులు పొందారు. అక్షర సేద్యం సాహిత్య సంస్థవారు నిర్వహించిన జాతీయ స్థాయి విద్యార్థుల కవిత పోటీలలో తడపాకల్ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న ఎ.గ్రీష్మ మరియు తొమ్మిదవ తరగతి చదువుచున్న డి. వైష్ణవి రాసిన కవితలు ఉత్తమ కవితలుగా జాతీయస్థాయిలో ఎంపికయ్యారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగు వందలకు పైగా కవితలు రాగా అందులో ఉత్తమంగా కొన్ని కవితలను అక్షర సేద్యం సాహిత్య సంస్థ వారు ఎంపిక చేసిన దానిలోనుండి తడపాకల్ పాఠశాల విద్యార్థులైన గ్రీష్మ రాసిన కవిత బతుకమ్మకు, వైష్ణవి రాసిన బతుకు విలువ కవితలకు గాను బహుమతి లభించిందని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ తెలిపారు. వీరికి త్వరలో సిద్దిపేటలో జరిగే బహుమతి ప్రధానోత్సవంలో ప్రశంసాపత్రమును జ్ఞాపికను అందజే స్తారని ప్రవీణ్ శర్మ తెలియజేశారు. జాతీయస్థాయిలో బహుమతులు సాధించిన విద్యార్థులను తడపాకల్ సర్పంచ్ పత్తిరెడ్డి ప్రకాష్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily