సీఎంగా రేంవత్ రెడ్డికి ఇంకా ఓకే చెప్పని కాంగ్రెస్ హైకమాండ్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో డిప్యూటీ సీతక్క అవకాశం?
సీఎల్పీ తీర్మానానికి ఖర్గే ఆమోదం
రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం
జీఏడీకి బాధ్యతల అప్పగింత
రాజభవన్ లో నేడు జరగాల్సిన కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనూహ్యంగా వాయిదా పడింది.. సిఎల్సీ అధినేతను డిల్లీ పెద్దలు ఖరారు చేయకపోవడంతో ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది.. సిఎల్సీ నేత ఎంపిక నిర్ణయాన్ని ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ సిఎల్సీ చేసిన ఏక వాక్య తీర్మానాన్ని నేటి ఉదయం ఢిల్లీకి పంపారు..నేడు అక్కడి ఉంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావించిన కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేయించారు.. అయితే డికె,శివకుమార్ తో సహా తెలంగాణ పరిశీలకులుగా ఉన్న వారందర్ని తక్షణం ఢిల్లీకి రావాలని పిలుపు రావడతో నేటి కార్యక్రమం వాయిదా పడింది..అధిష్టానం పిలుపుతో డికె, ఇతర నేతలు ఢిల్లీకి పయనమయ్యారు..
ఇది ఇలా ఉంటే తెలంగాణ సీఎంగా బాధ్యతలను స్వీకరించే అవకాశాన్ని రేవంత్‌రెడ్డికే కాంగ్రెస్ పార్టీ అప్పగించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, సీతక్క డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతోంది. అనూహ్యంగా మరో డిప్యూటీ సీఎం పదవికి సీతక్క పేరు వెలువడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషం నెలకొంది. ఒక దళిత, మరో గిరిజన నేతకు డిప్యూటీ సీఎం హోదా లభించటంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి సీతక్కకు గిరిజనశాఖ, లేక హోం మంత్రి పదవి లభిస్తుందని చాలామంది భావించారు. అకస్మాత్తుగా డిప్యూటీ సీఎం పదవికి యోగ్యురాలిగా ఎంపిక చేయటంతో కాంగ్రెస్‌లోని గిరిజన వర్గాలు సంబురపడుతున్నాయి.
సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే విషయంలో అందరికీ క్లారిటీ ఉన్నా సోమవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పార్టీ రథసారధిగా.. ఎన్నికల్లో రేవంత్ చూపించిన పోరాట పటిమకు హైకమాండ్ ఫిదా అయిందని, లోక్ సభ ఎన్నికల్లోనూ ఆయన సామర్థ్యాన్ని వినియోగించుకోవాలనే లక్ష్యంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని కీలక నేతలు చెబుతున్నారు. కర్నాటక సీఎం డీకే శివకుమార్ పంపించిన సీల్డ్ కవర్‌ను పరిశీలించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన ఆమోదాన్ని తెలుపుతూ సమాచారం ఇచ్చినట్టు కాంగ్రెస్ కీలక నేతలు మీడియాకు సమాచారం ఇచ్చారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో సంబురాలు..
ఖర్గే పంపిన కబురుతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. హైదరాబాద్ సిటీలో సంబరాలు చేసుకున్నారు. ఇక.. తెలంగాణ తదుపరి సీఎం ప్రమాణ స్వీకారం రాజ్ భవన్‌లోని దర్బార్ హల్‌లో సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందింది. కాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దర్బార్ హాల్‌లో 300 మంది కూర్చునే వెసులుబాటు కల్పించారు. మిగిలిన ఆహ్వానితులకు ఎక్కడ ఏర్పాట్లు చేయాలనే అంశంపై జీఏడీ అధికారుల కసరత్తు చేస్తున్నారు.
అందరి ఆమోద యోగ్యంతోనే..
సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఆమోదించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేకు లేఖను పంపించారు. ముఖ్యమంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని కొనసాగించాలనే తీర్మానాన్ని భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు సహా పది మంది ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టారు. ఈ భేటీలో సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు ఏకవాక్య తీర్మానం చేసి, అధిష్టానానికి సీల్డ్ కవర్‌లో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పంపించారు. అయతే సాయంకాలానికి పరిస్థితులు వేగంగా మారిపోయాయి.. తెలంగాణ పరిశీలకులు ఢిల్లీకి రావాలని పిలుపు రావడంతో సిఎల్పీ నేత ఎంపికపై కాంగ్రెస్ నేతలలో కొత్త టెన్షన్ ప్రారంభమైంది..