Thursday, January 23, 2025

ADB | విద్యార్థి మృతి

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభం కాని సమీకృత మార్కెట్ సముదాయంలో స్థానిక మైనార్టీ హాస్టల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది…

వివరాల్లోకి వెళ్తే… చెన్నూరు మండలం బీరెల్లి గ్రామానికి చెందిన మారోగోని అజయ్ (14) స్థానిక మైనార్టీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్లుగా గుర్తించారు. అజయ్ మృతిచెందిన సంఘటన స్థలం మైనార్టీ హాస్టల్ కు కూతవేటు దూరంలోనే ఉండడంతో విద్యార్థి మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement