హైదరాబాద్ – అభయహస్తం దరఖాస్తులను నిర్లక్ష్యంగా నడిరోడ్డుమీద పడేసిన ఘటనపై జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే స్పందించారు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు హయత్‌నగర్, కుత్బుల్లాపూర్ టీమ్ లీడర్లను సస్పెండ్ చేసింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, కాంగ్రెస్ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన హయత్‌నగర్ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు. పలువురు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అధికారులు స్పందించారు. దీనికి బాధ్యులైన ఉద్యోగులను గుర్తించి సస్సెండ్ చేశారు.