Saturday, January 18, 2025

Suryapet – రెండు బ‌స్సులు ఢీ – ఇద్ద‌రు స్పాట్ డెడ్ …

సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో నేటి ఉద‌యం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్ర‌మాదంలో ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న యోలో ప్రైవేట్ బస్సును వెనుక నుంచి వేగంగా జింగ్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. స్పీడ్ బ్రేకర్ ఉండటంతో ముందు వెళ్తున్న బస్సు నెమ్మదిగా వెళ్లింది.

ఒక్కసారిగా రోడ్డు పై ఎగిరి…
అయితే అది గమనించని వెనుకాల బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి ముందు బస్సును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వెనుక బస్సు బలంగా ఢీకొట్టడంతో ముందు వెళ్తున్న బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్సు అద్దాలు పగలడంతో అందులో ముందు ఉండే క్లీనర్ సాయి ఒక్కసారిగా రోడ్డుపై ఎగిరి పడిపోయాడు.

- Advertisement -

రోడ్డుపై పడిపోయిన క్లీనర్ పై నుంచి వెనుకాల ఉన్న బస్సు వెళ్లిపోయింది. దీంతో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ఉన్న ప్రయాణికుడు ప్రమాదం జరిగిన సమయంలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతులు గుంటూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement