Tuesday, November 26, 2024

Suryapet – ఫ‌లించిన కాంగ్రెస్ రాయ‌బారం – ప‌టేల్ ర‌మేష్ రెడ్డి నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ

సూర్యాపేట – సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డితో కాంగ్రెస్ చర్చలు సఫలం అయ్యాయి
కాంగ్రెస్ రెబ‌ల్ అభ్య‌ర్ధి గా వేసిన నామినేష‌న్ ను ఉప‌సంహ‌రించుకున్నారు..వివ‌రాల‌లోకి వెళితే కాంగ్రెస్ తనకు అవకాశం ఇవ్వకపోవడంతో సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటేల్ రమేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ బీ-ఫామ్ ఇచ్చింది. దీంతో పటేల్ రమేశ్ రెడ్డి ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా ఈ నెల 10న నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సూర్యాపేటలోని ఆయన నివాసానికి ఏఐసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రోహిత్ చౌదరి తదితరులు నేడు వెళ్లారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

అయితే ఆయన అందుకు ససేమీరా అన్నారు.. కార్య‌క‌ర్తలు కూడా నామినేష‌న్ ఉప‌సంహ‌రించ‌కోవ‌ద్ద‌ని తీవ్ర వ‌త్తిడి తెచ్చారు. పటేల్ రమేశ్ రెడ్డిని బుజ్జగించేందుకు వచ్చిన నేతలను ఆయన అనుచరులు అడ్డుకున్నారు. ఆయనకు అన్యాయం చేశారని, నామినేషన్ ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాల్సింది రమేశ్ రెడ్డి కాదని…. రాంరెడ్డి దామోదర్ రెడ్డి అని అన్నారు. చర్చలు జరుపుతుండగా వారు కూర్చున్న గదివైపు రాళ్లు విసిరారు. మల్లు రవి, రోహిత్ చౌదరిలు బయటకు వెళ్లకుండా గదికి తాళం వేశారు.

ఈ స‌మ‌యంలో ఎఐసిసి ప్ర‌ధాన కార్య‌దర్శి కెసి వేణుగోపాల్ , టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిలు ప‌టేల్ తో ఫోన్ లో మాట్లాడారు.. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో లోక్ స‌భ సీటు ఇస్తామ‌న హామీ ఇచ్చారు.. దీంతో మెత్త‌బ‌డిన ర‌మేష్ నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అంగీక‌రించారు.. నేడు నామినేష‌న్స్ ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి రోజు కావ‌డంతో చివ‌రి నిమిషంలో రిట‌ర్నింగ్ కార్యాల‌యానికి వెళ్లి నామినేష‌న్ ను ఉప‌స‌హ‌రించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement