వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది లక్ష జనహారతి కార్యక్రమం.. ఈ మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి జగదీష్ రెడ్డికి అవార్డుని అందించారు ఆ సంస్థ ప్రతినిధులు.ముందుగా లక్ష మందితో ఈ కార్యక్రమం చేస్తామని ప్రకటించగా అనూహ్యంగా మరింత పెరిగి 1,16,022 మంది వచ్చినట్లు ప్రతినిధులు ప్రకటించారు. కాగా సూర్యపేట నియోజకవర్గం వ్యాప్తంగా కన్నులపండుగగా, కాళేశ్వర జలాలకు లక్ష జన హారతి కార్యక్రమం జరిగింది.
చివ్వేంల వద్ద లక్షజన హారతి కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొన్నారు మంత్రి జగదీష్ రెడ్డి..అనంతరం గోదారమ్మకు చీర,సారె, పసుపు కుంకుమ సమర్పించారు.అనంతరం హారతి ఇచ్చి,ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞత తెలిపారు మంత్రి జగదీష్ రెడ్డి.
126 గ్రామాల పరిధిలో కాళేశ్వరం జలాలు పారుతున్న కాల్వల కట్టలపై చేరుకొని,హారతి ఇచ్చిన అన్నదాతలు సీఎం కేసీఆర్ కి కృతజ్ఞత తెలిపారు.