సూర్యాపేట – సూర్యపేట జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మహర్దశ పట్టనుంది.సుమారు 12 కోట్ల అంచనా వ్యయం తో ఆలయ అభివృద్ధి మరియు విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అంకురార్పణ చుట్టిన విషయం తెలిసిందే. కాగా అభివృద్ధి, విస్తరణ పనులకు 2021 , ఆగష్టు 23 న త్రిదండి చినజీయర్ స్వామిని భూమిపూజ చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యం అయిన ఆధునీకరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.. కాగా ఈ రోజు సూర్యాపేట లో సకల హంగులతో నిర్మించిన బ్రాహ్మణ సదనం ను ప్రారంభించాడానికి వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి తో కలిసి స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆధునీకరణ పనులను పరిశీలించారు.. ఆలయం లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దురాజ్ పల్లి సమీపం లో రూ 2.50 కోట్ల తో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం ను ప్రారంభించారు..
అనంతరం అక్కడే జిల్లా నలుమూలల నుండి వచ్చిన బ్రాహ్మణుల సమక్షంలో వెంకటేశ్వర్ల స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు 5 కోట్ల నిదులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు..ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి ప్రకటన చేశారు. స్థానిక శాసన సభ్యునిగా వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కి తన వంతుగా తన కుటుంభం తరుపున 40 లక్షల రూపాయలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. దీంతో బ్రాహ్మణులు అంతా కరతాల ద్వనులతో తమ హర్శాన్ని వ్యక్తం చేశారు. జయ హో జగదీష్ రెడ్డి అంటూ ఆశీర్వదించారు.