Friday, November 22, 2024

Suryapet – రాష్ట్రంలో రాక్షస పాలన – జగదీశ్ రెడ్డి

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం మిర్యాలగూడలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ఫేక్ కేసులు, లీకులు తప్పా కాంగ్రెస్‌ పార్టీకి పాలన చేతకాదన్నారు. నీళ్లులేక పొలాలు ఎండిపోతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు..సమైక్య పాలనలో నా ఫోన్ కూడా ట్యాప్ చేశార‌ని జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు.

లగడపాటి రాజగోపాల్ నాఫోన్‌ ట్యాప్ చేశార‌ని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలో నాయకుల ఫోన్లు ట్యాప్‌ చేశారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నాం. పోలీసులను ఏనాడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదన్నారు. ఎండిన పంటలకు నీళ్లు ఇవ్వమంటే చేతకాని దద్దమ్మలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇక జిల్లా పిచ్చి మంత్రి ఎగిరెగిరి పడుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు సాగర్ డెడ్ స్టోరేజ్‌లో కూడా నీళ్లు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు సాగర్‌లో నీళ్లు ఉన్నా ఇవ్వలేని చేతకాని దద్ద‌మ్మ‌లు కాంగ్రెస్ వాళ్లు అని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన హామీలపై ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

అంబేద్కర్ కు నివాళి

అంబేద్కర్ ఆలోచనా విధానంతో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ వ జయంతి సందర్భంగా పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో రైతు బజార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు.

ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత దేశానికి అందించిన రాజ్యాంగ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆయన మనందరికీ కల్పించిన హక్కులతో సమాజంలో దళితులంతా నేడు ఉన్నతంగా జీవిస్తున్నారన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగం అందించిన ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలని ఆకాంక్షించారు.

అనంతరం పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో పీపుల్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి గత 14 రోజులుగా జ్ఞాన దీక్ష తీసుకున్న అంబేద్కరిస్టులు తమ దీక్షను విరమించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement