సూర్యాపేట: మరో లంచావతారం ఎసిబి వలలో నేడు చిక్కాడు.. రూ.25 వేలు లంచం తీసుకుంటూ సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి (డిఎఫ్ఓ)రూపేందర్ సిం ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆయన ఇంట్లో పట్టణానికి చెందిన సొసైటీ సభ్యుల నుండి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో సోదాలు కొనసాగుతున్నాయి..
గతంలోనూ ఎసిపి చిక్కిన రూపేందర్
కాగా, రూపేందర్ సింగ్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా గతంలో పనిచేస్తున్న సమయంలో ఏసీబీ వలలో చిక్కుకున్నారు. రూపేందర్ సింగ్ తన ఒరిజినల్ పోస్ట్ మత్స్య శాఖలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కాగా తనకున్న పలుకుబడితో జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.