ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై సస్పెన్షన్ తో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లాలో ఈ సీజన్ వానాకాలం వరి ధాన్యం సేకరణ జిల్లావ్యాప్తంగా సజావుగా జరిగిందని తెలిపారు. సీజన్ పూర్తి అయిన వెంటనే 285 సెంటర్లకు సంబంధించిన రికార్డులు, ట్రక్కు చీట్స్ కలెక్టరేట్ కు తెప్పించి పరిశీలించినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొత్తం గత డిసెంబర్ 25 నాటికి జిల్లాలో పూర్తి చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డుల పరిశీలన వారం రోజుల పాటు అధికారుల పర్యవేక్షణలో పూర్తి చేశామన్నారు.
అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై శాఖా పరమైన చర్యల తీసుకున్నామన్నారు. అలాగే, బ్యాంక్ ఖాతాలలో జమ అయిన సొమ్మును రికవరీ చేస్తున్నట్లు వివరించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదు చేశామన్నారు. ధాన్యం అవకతవకలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ ఇంకా కొనసాగుతుందని కలెక్టర్ చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..