Saturday, November 23, 2024

నిఘా నేత్రాల ఏర్పాటు తప్పనిసరి.. ఏసీపీ సారంగపాణి..

బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉంటే ఎలాంటి మోసాలు జరగవని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి అన్నారు. మంగళవారం పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో కనుకుల బ్యాంక్ మేనేజర్ తో బ్యాంకులో భద్రత పై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంకుల పట్ల భద్రత గురించి ప్రజల్లో కూడా ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు మీరుకూడా వారికి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనిబ్యాంకు లోపల, బయట పరిసరాల విజబుల్ ఉండేలాగాసీసీ కెమెరాలు తప్పక అమర్చుకోవాలని వీటికి మూడు నెలల బ్యాక్ అప్ ఉండాలి. నాణ్యమైన రాత్రి పూట దృశ్యాలను చిత్రీకరించే నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేయాలి సెన్సర్‌తో కూడిన అలారమ్ సిస్టమ్‌ను అమర్చుకోవాలి వాటి పనితీరు పై కూడా ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ప్రతి బ్యాంక్ వద్ద రెండు షిప్టులలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. సెక్యూరిటీ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు పోలీసులను అలర్ట్ చేయాలి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే విధంగా సెక్యూరిటీ గార్డులు శిక్షణ పొందాలి, బ్యాంకు ఓపెన్ సమయంలో.. మూసిన తరువాత అనుమానిత వ్యక్తులు ఆ ప్రాంతంలో తిరిగినట్లు కనబడిన, ఏదైనా సమస్య వచ్చిన అత్యవసర సమయాల్లో తమ పోలీసు శాఖ వారికి సమాచారం తెలియజేయాలని అన్నారు.

అదేవిధంగా సెక్యూరిటీ అలారం చెక్ చేయాలనీ అలారం ఏదైనా సమస్య ఉంటే వెంటనే దానిని సరి చేపించాలి. ప్రతిరోజు రాత్రి సమయంలో తమ పోలీసువారి వారు కూడా వచ్చి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అట్టి తనిఖీ సమయంలో సెక్యూరిటీ గార్డు అక్కడ అందుబాటులో ఉండాలని లేనిపక్షంలో మరుసటి రోజున బ్యాంకు సిబ్బంది వారికి తెలియజేయడం జరుగుతుంది అన్నారు. బ్యాంకులోపల స్ట్రాంగ్ రూమూలలో తరుచు చెక్ చేస్తూ ఉండాలి. ప్రజలు ఎంతో కష్టపడి వారు సంపాదించిన డబ్బు, బంగారం ఇతర వస్తువులు నమ్మకంతో బ్యాంకులలో దాచుకోవడం జరుగుతుంది కావున వారి న‌మ్మ‌కాన్ని కాపాడవలసిన బాధ్యత బ్యాంకు అధికారులపైన.. పోలిసులపైన ఉన్నది అని సమన్వయంతో పని చేస్తూ ప్రజల నమ్మకాన్ని పొందేలాగా పని చేయాలని బ్యాంకు మేనేజర్ లకు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement