నేర పరిశోధనలో నిఘా నేత్రాలు కీలకమని జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు అన్నారు. చిరాక్ పల్లి గ్రామంలో 10 సీసీ కెమెరాలను స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి, ఎల్ అండ్ టి వారి సహకారంతో చిరాక్ పల్లి పీఎస్ నందు ఏర్పాటు చేయగా సీసీ కెమెరాల మానిటర్ ను డిఎస్పీ శంకర్ రాజు ప్రారంభించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ… మారిన కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. నేర పరిశోధనలో టెక్నాలజీ గొప్ప పాత్రను పోషిస్తుందని, ఫలితంగానే అన్ని ప్రాంతాల్లో థర్డ్ ఐ సేవలు కీలకంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఎస్సై కాశినాథ్, ఎల్ అండ్ టి ఆపరేషన్ మేనేజర్ పి.విజేందర్ రెడ్డి, రూట్ మేనేజర్ జి.నాగరాజు, క్రాంతి, రాములు, సిబ్బంది ఫాల్గొన్నారు.