Friday, November 22, 2024

జ‌నం స‌ర్”పంచ్”లు – ముఖం చాటేస్తున్న ప్రథమ పౌరులు

సభలు పెడితే రచ్చరచ్చే ..
ఆ భయంతోనే వెనుకడుగు
అందని 15వ ఆర్థిక సంఘం నిధులు
కార్యరూపం దాల్చని ఎన్నికల హామీలు
అత్యుత్సాహంతో ఇరుక్కుపోయిన గ్రామాల ప్రథమ పౌరులు
సకాలంలో నిధులందక బిల్లులు పెండింగ్‌
రూ.40 వేల కోట్ల వరకు ఉంటాయని అంచనా
12,769 గ్రామ పంచాయతీల్లో 80శాతానికి పైగా ఇదే సమస్యలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నిధుల లేమితో అభివృద్ధికి, హామీల అమలుకు ఆమడ దూరంలో ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌లు అయోమయ స్థితిలో ఉన్నారు. ఎలాగైనా బిల్లులు వస్తాయనుకుని పొంత డబ్బులతో పనులు పూర్తిచేసిన వారు అప్పుల్లో కూరుకుపోయారు. గెలుపే లక్ష్యంగా వాగ్ధానాలు గుప్పించి నాలుక కరుచుకున్నారు. సకాలంలో నిధులు అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు సుమారు రూ.40 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ క్రమంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రథమ పౌరులు, తమకు ఓట్లేసిన ప్రజల ముందు ముఖం చాటేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అందుకు సన్నగిల్లిన నిధుల లభ్యత ఒకటైతే, శక్తికి మించి ఇచ్చిన వ్యక్తిగత వాగ్ధానాలు మరొక సమస్యగా చెప్పవచ్చు. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సరిగ్గా సంవత్సరానికి (2019లో), అదేస్థాయి పోటీతో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో పంచాయతీకి సుమారు డజను మంది అభ్యర్థులు పోటీకి దిగడంతో ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగిన నాయకులు ఎలాగైనా గెలువాలన్న బలమైన ఆకాంక్షతో తమ శక్తి సామర్థ్యాలకు మించి వాగ్ధానాలు ఇచ్చారు. నిధుల విడుదల, వ్యయం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేక పోయారు. ఆ వ్యవహారం ఇటు ప్రభుత్వానికి, అటు కొన్ని పంచాయతీల్లో ధనిక వర్గానికి చెందిన సర్పంచ్‌లు, పరిశ్రమలు అధికంగా ఉండి ఆర్థిక వన రులను సమకూర్చుకునే సామర్థ్యం ఉన్న గ్రామాల్లో పరిస్థితి కొంత మేరకు మెరుగ్గా ఉంది. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే స్థానిక ప్రజా ప్రతినిధులకు సర్కారు వేల కోట్లు- బాకీ పడింది. గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన బిల్లులతో పాటు-గా గ్రామాల్లో చేసిన ఇతర పనులకు వేల కోట్లకు పైగా బిల్లులను పెండింగ్‌ ఉన్నాయి. వీటిలో శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్‌ భగీరథ పనులున్నాయి. సర్పంచ్‌ల అత్యుత్సాహంతో అంచనాకు మించి పనులు పూర్తికావడంతో ప్రభు త్వం అయోమయంలో చిక్కుకుంది. విడుదల చేస్తే ఆ మొత్తం ఏపాటికీ సరిపోక అధికారులు ఫ్రీజింగ్‌లో పెట్టారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులతో సహా మొత్తం సర్కారు బాకీ పెరిగి పోయింది.
దీంతో సర్పంచ్‌లు తిరుగుబాటు- మొదలుపెడుతున్నారు. అప్పులు తెచ్చి మరీ గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తిచేసిన సర్ప ంచ్‌లకు రెండేళ్ళయినా బిల్లులు విడుదల కాకపోవడంతో సమస్య మరింతగా జఠిలమవుతోంది. ఒక్కో సర్పంచ్‌కు సగటు-న రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బిల్లులు రావాల్సి ఉంది. కేంద్ర నిధులతో అనుమతి లేని పనులు చేయడంతో బిల్లులు రాక, అప్పులు మొదల య్యాయి. రెండేండ్ల నుంచీ ఉపాధి హామీ నిధులతో గ్రామ పంచా యతీల్లో రైతు వేదికలను నిర్మించారు. ఒక్కో రైతు వేదికను రూ.18 లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా.. ఇందులో రూ.12.5 లక్షలను కేంద్ర నిధులను వినియోగించుకున్నారు. మిగతా నిధులను సర్పం చ్‌లే సమకూర్చి ఏడాదిన్నర కిందటే నిర్మాణాలు పూర్తిచేశారు. కానీ ఇంతవరకు వారికి బిల్లులు విడుదల కాలేదు. ఈ తరహాలోనే గ్రామాల్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, మొక్కల పెంపకం, ఇంకుడు గుం తలు, డంపింగ్‌ యార్డులు ఇతర అభివృద్ధి పనుల బిల్లుల కోసం కూడా సర్పంచ్‌లు ఎదురుచూస్తున్నారు. ప్రతి నెలా పంచాయతీ కార్మికుల జీతాలు, ట్రాక్టర్‌ ఈఎంఐ, డీజెల్‌ ఖర్చులు, కరెంట్‌ బిల్లులు చెల్లిం చటానికి అప్పులు చేస్తున్నామని, వీటిపై వడ్డీ భారీగా పెరుగుతోందని సర్పంచ్‌లు చెబుతున్నారు. వీటితో పాటు-గా శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మించారు. స్థాయిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని నిర్ణీత సమయాలను కేటాయించి, సర్పంచ్‌లపై ఒత్తిడి పెట్టి నిర్మాణాలు పూర్తి చేశారు.
కానీ, బిల్లులు మాత్రం ఇప్పించలేకపోయారు. దీంతో రాష్ట్రంలో 80శాతానికి పైగా గ్రామాల్లో సర్పంచ్‌లు అప్పుల్లో కూరుకు పోయారు. బిల్లులు అందకపోవడంతో వడ్డీ కట్టలేక సతమతమవు తున్నారు. జిల్లా కలెక్టర్లు టార్గెట్లు- పెట్టి, సస్పెషన్లతో భయపెట్టి ఉరికించి పనులు చేయించుకున్న తర్వాత ఇప్పుడు బిల్లులు ఇవ్వక చేతులెత్తేశా రని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పల్లె ప్రగతితోనే కష్టాలు, స్వీయ ఆదాయం ప్రశ్నార్ధకం
పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మార్చేస్తున్నా మని స్థానికంగా గొప్పలు చెప్పుకున్న సర్పంచ్‌లు ఇప్పుడు ప్రజల్లో ముఖం చాటేశారు. ప్రతీ గ్రామంలో హరితహారం నర్సరీల నిర్వహణ, ఆ మొక్కలను కాపాడటం, గ్రామీణ పార్కులు, చెత్త డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలూ.. ఇవన్నీ పంచాయతీలకు భారమవుతు న్నాయి. వీటి నిర్మాణం, నిర్వహణ బాధ్యతలన్నీ సర్పంచ్‌లకు అప్పగించింది. అందుకు తగిన నిధులను సమకూర్చుకునే బాధ్య తలను కూడా ఇచ్చింది. దీంతోనే గ్రామాల సర్పంచ్‌లకు అప్పులు ఎక్కువయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీ లుండగా 7100 మైనర్‌ పంచాయతీలున్నాయి. వీటితో కొత్తగా ఏర్పా-టైన గ్రామాలు 4383 ఉన్నాయి. ఇవన్నీ మరింత చిన్న పంచాయతీలు. 500 నుంచి 600 వరకు జనాభా ఉన్నవి మాత్రమే. వీటికి స్వీయ ఆదా యం చాలా తక్కువ. అటు- ప్రభుత్వం నుంచి వచ్చే పల్లె ప్రగతి నిధులు కూడా తక్కువే. ఇక చిన్న గ్రామ పంచాయతీలైతే తీవ్ర కష్టాలు ఎదు ర్కొంటు-న్నాయి. అలాంటి గ్రామాల్లో ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేసిన సర్పంచ్‌లు ఇప్పుడు రోడ్డున పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement