టీజీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ మెయిన్ పరీక్షను, నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. ఈ గ్రూప్ 1 పరీక్షల్లో తెలుగు అకాడమీ సిలబస్ ను పరిగణలోకి తీసుకోకపోవడంతో పలువురు అభ్యర్థులు ముందుగా హైకోర్టును ఆశ్రయించారు.
అలాగే ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని కూడా కోరారు. అయితే దీనికి కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే గ్రూప్ 1 పరీక్షల ప్రిలిమ్స్ పరీక్షను పూర్తి చేసి ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని నేడు తీర్పు చెప్పింది.