ఢిల్లీ : సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సినీనటుడు మోహన్ బాబు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను గత నెల 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
- Advertisement -