Monday, November 18, 2024

తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు

విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ జెన్ కో, ట్రాన్స్ కోలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవట్లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు వేసిన వ్యాజ్యాన్ని మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది.

ధర్మాధికారి కమిటీ నివేదిక ప్రకారం మొత్తం 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు. అందులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 655 మందిని విధుల్లోకి తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం.. 84 మందిని మినహాయించి మిగిలిన వారిని విధుల్లోకి తీసుకుంది. దీంతో ఆ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీఎసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్ ఆఫీస్ అధికారి గోపాలరావులకు నోటీసులను ఇచ్చింది. విచారణను జులై 16కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: మారని మందు బాబుల తీరు.. మద్యం మత్తులో ఘోరం

Advertisement

తాజా వార్తలు

Advertisement