Wednesday, November 20, 2024

సుఫారీ గ్యాంగ్… బెడిసి కొట్టిన మర్డర్ ప్లాన్

సూర్యాపేట జిల్లాలో సుఫారీ గ్యా౦గ్ రెచ్చిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉప్పల శ్రీను మర్డర్ చేసేందుకు ప్రత్యర్థులు ప్లాన్ వేశారు. అయితే, పోలీసుల అప్రమత్తతతో ప్లాన్ బెడిసి కొట్టింది. శ్రీను కోసం రెక్కీ నిర్వహిస్తున్న ఎనిమిది మంది సుఫారీ గ్యా౦గ్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల నుంచి వేటకొడవళ్ళు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీను గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. తనను కూడా హత్య చేస్తారనే భయంతోనే శశిధర్ రెడ్డి అనుచరుడు మర్డర్ ప్లాన్ వేశాడు. నిందితులను రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నారు. హత్య కుట్రలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేదానికి ఆరా తీసుకున్నారు.

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడలో ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన జరిగిన రియల్టర్‌ గుర్రం శశిధర్‌రెడ్డి(50) హత్య జరిగింది. సుపారీ గ్యాంగ్‌ పక్కాగా స్కెచ్‌ వేసి.. జీపీఎస్‌ పరికరంతో ట్రాక్‌ చేసి మరీ శశిధర్‌రెడ్డిని హతమార్చిందని పోలీసులు గుర్తించారు. మరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఉప్పల శ్రీనివాస్‌ అలియాస్‌ బంక్‌(ఆయిల్‌) శ్రీను ఈ హత్యలో సూత్రధారి అని నిర్ధారించారు. శశిధర్‌రెడ్డి కొనుగోలు చేసిన ఏడెకరాల భూమి ఈ హత్యకు ప్రధాన కారణమని తేల్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని విద్యానగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఉప్పల శ్రీనివాస్‌ అలియాస్‌ బంక్‌(ఆయిల్‌) శ్రీనుకు అతని రెండో భార్య పద్మతో విభేదాలున్నాయి. దీంతో ఆమె తన కుమార్తెతో కలిసి గుంటూరులో ఉంటోంది. పద్మ, ఆమె కుమార్తె పేరిట సుమారు రూ. 21 కోట్లు విలువ చేసే ఏడెకరాల భూమి ఉంది. శ్రీను, పద్మల మధ్య గొడవలను ఆసరాగా చేసుకున్న రియల్టర్‌ గుర్రం శశిధర్‌రెడ్డి.. ఆ భూమిని మార్కెట్‌ ధరకంటే తక్కువకు కొనుగోలు చేశాడు. అంతటితో ఆగకుండా.. శ్రీనుకు చెందిన భూమిలో కూడా ఫెన్సింగ్‌ వేశాడు.

 దాంతో శశిధర్‌, శ్రీనులకు గొడవలు జరిగాయి. శ్రీనుని తీవ్రంగా బెదిరించడంతో తన ప్రాణాలకూ ముప్పు ఉందని గ్రహించి, శశిధర్‌రెడ్డిని అంతమొందించాలని శ్రీను నిర్ణయించాడు. ఈ క్రమంలో మద్దిరాల మండలం చిన్ననెమిల గ్రామానికి చెందిన షేక్‌ జానీని సంప్రదించాడు. అతను వరంగల్‌కు చెందిన అబ్బరమీనా రమేశ్‌ అలియాస్‌ ఇడ్లీ రమేశ్‌, గొట్టిముక్కల రాజిరెడ్డిలకు విష యం చెప్పాడు. వారు వరంగల్‌కు చెందిన మేకల రమేశ్‌, మేదరి వేణు, పంగ రవి, మేకల ప్రవీణ్‌లను శ్రీనివాస్‌, జానీలు రమేశ్‌, రాజిరెడ్డిలతో కలిసి.. గత ఏడాది డిసెంబరు 13న నకిరేకల్‌లో శ్రీనుని కలిశారు. అప్పుడే శశిధర్‌రెడ్డి హత్యకు వ్యూహరచన చేశారు. శశిధర్‌రెడ్డిని చంపేస్తే.. ఒక్కొక్కరికీ రూ. లక్ష నగదుతోపాటు.. వివాదంలో ఉన్న స్థలంలో కుంట భూమిని గానీ, దానికి సరిపడా నగదును గానీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉప్పల శ్రీను వీరందరికీ సూర్యాపేటలోని తన నివాసంలో వసతి కల్పించాడు. ఈ సుపారీ ముఠాలో.. చల్లా పూర్ణచంద్రారెడ్డి, గిన్నారపు రవీందర్‌, వీరగోని శ్రీనివాస్‌, అంబాల కుమారస్వామి, ఈరా వినయ్‌ కూడా ఉన్నారు. వీరంతా పలుమార్లు రెక్కీ నిర్వహించారు. ఈ ముఠా శశిధర్‌రెడ్డి హత్యకు మూడుసార్లు విఫలయత్నం చేసింది. చివరికి ఫిబ్రవరి 2న తన పొలంలో ఉన్న శశిధర్‌రెడ్డిని కత్తులు, వేడకొడవళ్ల తో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో శశిధర్‌రెడ్డి అనుచరుడు ఉప్పల శ్రీను హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : ఇలా చేసి మొబైల్ రేడియేషన్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకొండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement