Monday, November 18, 2024

Breaking: తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సునీల్ కనుగోలు

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఫిర్యాదుతో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో పాటు ఆయన బృందంపై 469, 505 సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల సునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో సునీల్ కనుగోలు పిటిషన్ దాఖలు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement