పాతబస్తీలోని చార్మినార్ వద్ద కూడా ప్రతి ఆదివారం ‘ సన్ డే ఫన్ డే’ నిర్వహించనున్నారు. ప్రస్తుతం టాంక్ బండ్ పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్ డే ఫన్డేకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపధ్యంలో చార్మినార్ వద్ద కూడా సన్డే ఫన్డే నిర్వహించాలని నగర వాసులు నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ తదితరులు చార్మినార్ను సందర్శించి ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు. సండే – ఫన్డే ఏర్పాట్లపై సమీక్షించారు. కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణతో పాటు పార్కింగ్ ఏర్పాట్లపై చర్చించారు.
ఇది కూడా చదవండి: నైరుతి తిరోగమనం: ఏపీలో రెండు రోజులు వర్షాలు