హైదరాబాద్ – పీపుల్స్ ప్లాజా వేదికగా ఏర్పాటుచేసిన సమ్మర్ ఉత్సవ్ మేళాలో అద్భుత రీతిలో ఆకట్టుకుంటున్న పిష్ టన్నల్‌ను సందర్శించేందుకు పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు సమ్మర్ ఉత్సవ్ మేళా నిర్వాహకుడు మిర్జా రఫీక్ బేగ్ తెలిపారు. .పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రఫీక్ బేగ్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తమ వంతుగా 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఈ నెల 19, 20, 21 మూడు రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న అరిపమ ఫిష్ 5 అడుగుల పొడవు, 60కిలోల బరువు ఉన్న ఈ చేప చికెన్ ఆహారంగా తీసుకుంటుంది. ఇలాంటి చేపలు ఎన్నో ఉన్నాయి.
ఈ అవకాశాన్ని వివిధ పాఠశాలల యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిష్ టన్నల్‌లో ఏర్పాటుచేసిన 400 రకాల చేపలను ఒకే వేదికగా చూసి విద్యార్థులు నాలెజ్జ్‌ను పెంచుకోవచ్చని, సముద్రంలో మాత్రమే లభించే ఎన్నో రకాల చేపలను పిష్ టన్నల్‌లో ఏర్పాటుచేసినట్లు తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వచ్చి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాల కోసం 8686864772 నెంబర్‌లో కూడా సంప్రదింవచ్చు.