Friday, November 22, 2024

Summer Heat in Winter – రుతుప‌వ‌నాలు తిరుగ‌మ‌నం …. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు….

హైద‌రాబాద్ – నైరుతి రుతుపవనాల తిరోగమనం వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ రోజురోజుకు వేడెక్కుతోంది. అప్పుడప్పుడు మేఘావృతం అవుతున్నా చుక్క వర్షం మాత్రం కురవడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది. వచ్చే పది రోజులు కూడా ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

వాతావరణం వేడెక్కడంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు వేడు గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాన్లు వస్తుంటాయి. అవి వస్తే తప్ప వాతావరణం చల్లబడే అవకాశం లేదని వాతావరణశాఖ అభిప్రాయపడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ఇప్పటికే ప్రారంభమైందని తెలిపింది. అయితే, ఈ నెల 9 వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ప్రస్తుతం 32 డిగ్రీలు, ఆపై ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement