పెద్దపల్లి – బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి జిల్లాల్లో గట్టి షాక్ తగులుతుంది. రోజుకో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. ఈ బాటలోనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపలిటీ నడిచింది. మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.
మొత్తం15 మంది కౌన్సిలర్లలో, చైర్ పర్సన్ ముత్యం సునీత పై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 12 మంది కౌన్సిలర్లు ఓటేశారు… ఓటు వేసిన వారిలో 5 మంది కాంగ్రెస్, 7 గురు బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. వాస్తవానికి 15 మంది కౌన్సిలర్లలో 5 గురు కాంగ్రెస్, 9 మంది బిఆర్ఎస్ పార్టీకి చెందినవారు ఉండగా ఏడుగురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేసి చైర్మన్ ను గద్దెదింపారు.