మహబూబ్ నగర్ – తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి గురుకుల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు 7వ తరగతి విద్యార్థి. వనపర్తి జిల్లా మదనాపురం బాలుర గురుకులంలో దుప్పటితో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కొన్నురు గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి ప్రవీణ్. ఈ విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు.. కానీ.. ఎవరూ లేని సమయంలో ఈ సంఘటన జరిగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై అధికారులు కూడా ఏం చెప్పడం లేదు. ఉపాధ్యాయులు వేధిస్తే.. ఇలా చేసుకున్నాడా.. లేక ఇతర కారణాల తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement