Friday, September 20, 2024

Suicide – ఆన్ లైన్ బెట్టింగ్ కు బ‌లి

ఏకంగా రూ రెండు కోట్లు బెట్టింగ్
దీని కోసం అందిన‌కాడికి అప్పులు చేసిన యువ‌కుడు
రుణం తీర్చాలంటూ అప్పుల వాళ్ల వ‌త్తిడి
సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌లో దూకి ఆత్మ‌హ‌త్య
న‌ల్గండ‌లో ఘ‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న‌ల్గొండ‌- ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివ‌రాల‌లోకి వెళితే నల్గొండ పట్టణానికి చెందిన తడకమల్ల సోమయ్య కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా అతని కుమారులు సాయికుమార్ (28), సంతోష్ వ్యాపారంలో సహాయం చేస్తున్నాడు. అయితే ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా సాయికుమార్ దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు ఇంటికి వచ్చి కొద్దిరోజులుగా ఒత్తిడి చేశారు. దీంతో సాయికుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 14న బయటకు వెళ్లిన సాయికుమార్ ఇంటికి తిరిగి రాకపోవడంతో సోదరుడు సంతోష్ 17న నల్గొండలోని వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసుల‌కు హాలియా చెక్‌పోస్టు వద్ద 14వ మైలురాయి సమీపంలో సాయికుమార్ సెల్‌ఫోన్ సిగ్నల్స్ కనిపించాయి. సాగర్ కాల్వ వద్ద ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ వదిలేసి కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి సాయికుమార్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దోసపహాడ్‌ గ్రామ సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువలో నేడు మృతదేహం తేలడంతో పెన్‌పహాడ్‌ పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement