Thursday, November 21, 2024

ఆర్ఎఫ్ సిఎల్ బాధితుడి ఆత్మహత్య- బావిలో మృతదేహం

రామగుండం ఎరువుల కార్మాగారంలో ఉద్యోగం కోసం లక్షల్లో దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవ‌డంతో మనస్థాపానికి గురైన ముంజ హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు చెల్లించి మోసపోవడంతో బాధితులు రోడ్డు ఎక్కాడు. బాధితులు ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన లాభం లేకపోవడంతో శంకరపట్నం మండలం అంబాజీపూర్ గ్రామానికి చెందిన ముంజ హరీష్ సోష‌ల్ మీడియాలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. తన ప్రాణ త్యాగంతో నైనా బాధితులకు న్యాయం జరుగుతుందన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హరీష్ కోసం సెల్ ఫోన్ లో సిగ్నల్ ఆధారంగా ప్రయత్నించినాజాడ తెలియలేదు. శనివారం కమాన్పూర్ చెరువు వద్దగల భావి సమీపంలో హరీష్ కు చెందిన ద్విచక్ర వాహనం కనిపించడంతో ఆ దిశగా ప్రయత్నించారు. బావిలో హరీష్ మృతదేహాన్ని కనుగొని.. వెలికి తీసి పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హరీష్ బలవన్మరణానికి పాల్పడడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement