Monday, September 16, 2024

Suicide – ఆ ఉద్యోగికి ఏం కష్టం వచ్చిందో….

ట్యాంక్ బండ్ లో దూకి ఉద్యోగి ఆత్మహత్య
.. పెద్దపల్లి లో విషాదం

పెద్దపల్లి, ఆంధ్రప్రభ
ట్యాంక్ బండ్ లో దూకి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆరెపల్లి జంపయ్య శుక్రవారం రాత్రి నుండి కనబడడం లేదని బంధువులు తెలియజేశారు. శనివారం ఉదయం ట్యాంక్ బండ్ లో మృతదేహం తేలిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

- Advertisement -

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జంపయ్య ఆత్మహత్య కారణాలు తెలియాల్సి ఉంది. నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పెద్దపల్లి పోలీసులు తెలియజేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement