తనకు నచ్చని హెయిర్ కట్ చేయించారన్న మనస్థాపంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే… మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన ఈసం కాంతారావుకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన ఈసం హర్షవర్ధన్ (9) సీతానగర్‌లోని హాస్టల్‌లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చాడు. మే 25న కాంతారావు తన కుమారుడు హర్షవర్ధన్‌ను హెయిర్ కటింగ్ కోసం స్థానిక సెలూన్ షాపుకు తీసుకెళ్లాడు. తండ్రి చెప్పిన విధంగా సెలూన్ లో హెయిర్‌కట్ చేశారు. కటింగ్ నచ్చలేదని హర్షవర్ధన్ గొడవ చేశాడు. ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హర్షవర్ధన్ శుక్రవారం ఉదయం 8 గంటలకు మృతి చెందాడు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గంగారం ఎస్సై బి.రవికుమార్ వివరించారు.
Suicide – హెయిర్ కట్ నచ్చలేదని.. బాలుడు ఆత్మహత్య
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement