Tuesday, November 19, 2024

NZB: షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామనడం ఎన్నికల స్టంటే… ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, మే 3( ప్రభ న్యూస్): షుగర్ ఫ్యాక్టరీలు కాంగ్రెస్ తెరిపి స్తామనడం కేవలం ఎన్నికల స్టంటే ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకే, రైతులను మభ్య పెట్టడానికే చక్కెర ప్యాక్టరీలు తెరిపిస్తామని కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని మండి పడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ 66 ఫ్యాక్టరీలను తేరిపించిన ఘనత బీజేపీదేనని అన్నారు.

శుక్రవారం బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… చెరకు ఫ్యాక్టరీల కోసం కాంగ్రెస్ పార్టీ యూనియన్ బ్యాంక్ కు సుమారు రూ.40 కోట్ల రూపాయలు చెల్లించి ఫ్యాక్టరీలను నడిపిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. షుగర్ ఫ్యాక్టరీల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాడు.. ఆ కమిటీ ఫ్యాక్టరీని డిసెంబర్ 2025 నాటికి పున ప్రారంభిస్తామని గతంలో చెప్పడం జరిగిందన్నా రు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే నిజామాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో బాసర అమ్మవారి మీద ప్రమాణం చేసి సెప్టెంబర్ 15న షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పడాన్ని గుర్తు చేశారు.

ముస్లిం అలీగడ్ యూనివర్సిటీ స్పెషల్ అమెం డ్‌మెంట్ యాక్ట్ తెచ్చి ఎస్సి ఎస్టిలకు రిజర్వేషన్లు రద్దు చేయించిన ఘనత కాంగ్రెస్ ద‌ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాతీయ మేనిపెస్టోలో రుణమాఫీపై కమిషన్ వేస్తా…అంటుందని… కానీ రేవంత్ రెడ్డి రుణమాఫీని ఆగస్టు 15వరకు విడుదల చేస్తామనడంలో అంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. కర్ణాటకలో బాంబులు పేలడంలో జగి త్యాలలో మూలాలు ఉన్నాయని ఆరోపించారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరుట్ల జగిత్యాలను ఫిఎఫ్ఐ అడ్డాగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ను పవర్ లో నుండి పక్కకు పెట్టకుంటే దేశానికే ప్రమాదమని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మరని ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement