కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా కొట్టె సుధాకర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. రామగుండం కేంద్రంగా ఆ బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇంతకాలం ఆ బాధ్యతల్లో నల్లా వెంకటేశ్వర్లు కొనసాగారు. గత వారం ఆయనను సర్వీసు నుంచి టెర్మినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఇప్పుడు సుధాకర్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం సుధాకర్ రెడ్డి జగిత్యాల సర్కిల్ చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఉన్నారు.
నల్లా వెంకటేశ్వర్లును టెర్మినేట్ చేసిన తర్వాత అదనపు బాధ్యతలను ప్రభుత్వం సుధాకర్ రెడ్డికి అప్పగించింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఆయనను ఈ-ఇన్-సీ బాధ్యతల్లో నియమించింది. ఎమ్మెల్యేల బృందం ఇటీవల మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్ళినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ మొదలు ప్రారంభోత్సవం వరకు మొత్తం వ్యవహారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రూపంలో సుధాకర్ రెడ్డి వివరించారు. విజిలెన్స్ ఎంక్వయిరీ జరిగినప్పుడు కూడా డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్‌కు మేడిగడ్డ విషయాలను వివరించినవారిలో నల్లా వెంకటేశ్వర్లుతో పాటు సుధాకర్ రెడ్డి కూడా ఉన్నారు.