నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 24) ప్రభా న్యూస్…దసరా పండుగ మరియు చివరి రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.తెలంగాణకు ప్రత్యేక బతుకమ్మ పండగ చివరి రోజు కావడంతో మినీ ట్యాంక్ బండ్ పై వేలాదిగా తరలివచ్చిన మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మను గంగలో కలిపి సాగనంపేందుకు కుటుంబ సమేతంగా మినీ ట్యాంక్ బండ్ చేరుకొని మహిళలు యువతులు ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఆ ప్రాంతాన్ని మరింత పండగ వాతావరణం లా నెలకొల్పారు. మినీ ట్యాంక్ బండ్ ను మున్సిపల్ అధికారులు మినీ లైట్లతో నక్షత్ర దివిలో సుందరంగా అలంకరించారు.
పోలీసు అధికారులు ట్యాంక్ అండ్ వెళ్లే నిలవైపులా బర్కెట్ ఏర్పాటు చేసి వాహనాలు లోపటికి రాకుండా నిర్వహించి అక్కడికి వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా చూశారు. ఈ క్రమంలో వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయడంతో వచ్చి వెళ్లే వాహనదారులకు కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ పోలీసు అధికారులు చూడాలని చూపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసరి సముద్రం పై వెలసిన మినీ ట్యాంక్ బండ్ జిల్లా ప్రజలకు కానీ విని ఎరుగని రీతిలో దసరా రోజున మంచి అనుభూతినిచ్చింది.
ఈ సందర్భంగా అక్కడ చేరుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు ప్రజలతో మమేకమై వారి వద్ద సెల్ఫీలు దిగుతూ పండుగను ఆస్వాదించారు.