Saturday, November 30, 2024

WGL | ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సు ఆకస్మిక మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణ ఘటన జరిగింది. స్థానిక అస్పత్రిలో ఏఎన్ఎమ్ గా విధులు నిర్వహిస్తున్న అప్సర భీ (30) నేడు ఆస్పత్రిలోనే మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు మదార్ సుల్తాన్ బీ తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా వున్నాయి..

తమ కూతురు ఆస్పత్రి ప్రారంభం నుండి ఇక్కడే పనిచేస్తుందని శుక్రవారం రాత్రి 8.30గంటలు విధులకు వచ్చింది. తెల్లవారు జామున ఆస్పత్రి సిబ్బంది ఇద్దరు తమ ఇంటికి వచ్చి కూతురు ఆరోగ్యం బాగాలేదని తమను ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే తమ కూతురు చలనం లేకుండా పడి ఉందన్నారు. ఇక్కడి నుండి తమ కుమార్తెను వరంగల్ అస్పత్రికి తీసుకువెళ్లగా… అప్పటికే మృతిచెందిందని అక్కడి వైద్యులు తెలిపారన్నారు. తమ కూతురు ఒంటిపై గాయాలు వున్నాయని, ఆస్పత్రిలో ఏదో జరగడంతోనే మృతిచెందిందని ఆరోపించారు.

కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని కోరుతూ మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా జనరల్ అస్పత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement