హైదరాబాద్, అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు. ఇచ్చింది. మంగళవారం తుది తీర్పులో బతుకమ్మ కుంటగానే హైకోర్టు గుర్తించింది కాగా బతుకమ్మ కుంట స్థలం తమదంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు. కొట్టివేసింది
అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మీద గత 3 దశాబ్దాలుగా తనదిగా చెబుతున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డికి హైకోర్టులో మంగళవారం చుక్కెదురైంది. బతుకమ్మ కుంట చెరువు పునరుద్ధరణలో హైడ్రా చర్యలు సక్రమమేనంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
అంబర్‌పేటలో బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హైడ్రాను సంప్రదించడమే కాకుండా..సంబంధిత పత్రాలను కూడా అందజేసిన విషయం విధితమే. చెరువుల పునరుద్ధరణలో భాగంగా నవంబరు 13వ తేదీన అబర్‌పేటలోని బతుకమ్మ కుంటను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ . అదే రోజు పునరుద్ధరణకు హైడ్రా చర్యలు ప్రారంభించిన విషయం విధితమే.
హైడ్రా చర్యలపై ఎడ్ల సుధాకర్‌రెడ్డి 14.11.24న కోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత హైడ్రా , రెవెన్యూ, ఇరిగేషన్, సంబంధిత శాఖ అధికారులు సర్వే నంబరు 563 లో ఉన్న భూ రికార్డులను పరిశీలించి కోర్టులో కౌంటర్ దాఖలుచేయగా… ఇరువైపుల వాదనలు విన్న గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కరరెడ్డి పిటిషనర్ అయిన ఎడ్ల సుధాకర్ రెడ్డికి ఈ భూమిపై ఎలాంటి హక్కులేదని తీర్పుచెప్పారు.
అది బతుకమ్మ కుంటగానే నిర్ధారించారు. బతుకమ్మకుంటపైన 2017 సంవత్సరంలో హైకోర్టు డబుల్ బెంచ్ చెరువుగానే తీర్పును వెలువడించినది. ఫిర్యాదుదారుడికి ఏమైనా హక్కుంటే సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
*హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీరంగనాథ్ . *
ప్రభుత్వం తరఫున సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి.. అనుకూలమైన తీర్పు రావడంలో కృషి చేసిన హైడ్రా లీగల్ బృందంతో పాటు, రెవెన్యూ ఉద్యోగులను మంగళవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సన్మానించారు.. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ కె. రవీందర్‌రెడ్డి, సీహెచ్. జయకృష్ణ, హైడ్రా న్యాయ సలహాదారుడు శ్రీనివాస్, హైడ్రా లీగల్ విభాగం లైజినింగ్ అధికారి డి. మోహన్, హైడ్రా డిప్యూటీ కలెక్టర్ ఎల్. సుధ, తహసిల్దార్ ఎం.హేమ మాలిని, తహసిల్దార్ పి. విజయ్ కుమార్, అంబర్‌పేట తహసిల్దార్ బి. వీరాబాయి, సర్వేయర్ కిరణ్‌లతో పాటు పలువురు అధికారులను ప్రత్యేకంగా అభినందించి.. శాలువతో సన్మానించిన హైడ్రా కమిషనర్.
బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకురానున్న హైడ్రా.
* 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట.
* బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చిన సర్వే అధికారులు .
.* తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి 5.15 ఎకరాల విస్తీర్ణం.
* ప్రస్తుతతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు.
* ప్రస్తుతతం అక్కడ నివాసం ఉంటున్న వారికి ఎలాంటి ముప్పు లేకుండా చెరువు తవ్వకానికి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారి ఆదేశాలు.
ఒకప్పటి ఎర్రకుంటనే.. కాలక్రమంలో బతుకమ్మ కుంటగా మారిందన్న స్థానికులు. రెవెన్యూ రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
*కాలక్రమంలో బతుకమ్మకుంటలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు పోయడంతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిందన్న స్థానికులు.
. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టనున్న హైడ్రా. బతుకమ్మ కుంటలో నీటితో కళకళలాడితే పరిసర ప్రాంతల్లో పర్యావరణం, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్న కమిషనర్ రంగ నాథ్