పెద్దపల్లి నియోజకవర్గంలోని రైతాంగానికి వరద కాలువ నుండి ఎల్లంపల్లి నీటిని కాకతీయ కెనాల్ కు తరలించేందుకు నిర్మిస్తున్న ఉప కాలువ పనులు దాదాపు పూర్తయ్యాయని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. గంగాధర మండలం ర్యాలపల్లి నుండి మల్యాల మండలం తాటిపల్లి వరకు 36 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మూడు కిలోమీటర్ల ఉప కాలువ పనులను శనివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉప కాలువ పనులు వారం రోజుల్లో పూర్తవుతాయన్నారు. మరో పది రోజుల్లో నీటి విడుదల ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
నీటి విడుదల ప్రారంభమైతే నియోజకవర్గంలోని చివరి భూముల్లో రైతాంగం సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. పెద్దపెల్లి నియోజకవర్గంలోని ఓదెల, శ్రీరాంపూర్ మండల రైతుల కష్టాలు త్వరలో దూరం కానున్నాయన్నారు. ఉప కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..