Sunday, November 24, 2024

TG | విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం బాధ్యత : మంత్రి దుద్దిల్ల శ్రీదర్

మహబూబ్ నగర్, (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో గత పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్త పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యాప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుని విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ బాధ్యత అనే విధంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో మంత్రి శ్రీదర్ బాబు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వ బాలికల ఐటీ కళాశాల ప్రాంగణంలో రూ 9.48 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత బాటుర, బాలికల అదునాతన సాంకేతిక కేంద్ర భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…

ఐటీఐలను అప్ గ్రేడ్ చేయాలనే ఉద్ధేశంతో రాష్ట్రంలో 65 ఐటీఐ కళాశాలలు టాటాకన్సెల్టెన్స్ భాగస్వామ్యంతో ఐటీసీ సెంటర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో బాలికల కళాశాలను ఏటీసీగా మార్చామని, త్వరలో బాలుర కళాశాలను కూడా ఏటీసీగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఏటీసీ సెంటర్లో సాంకేతిక అడ్వాన్స్ ఆరు కోర్సుల్లో శిక్షణ ఉంటుందని, శిక్షణ పూర్తయిన తర్వాత ఉద్యోగవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పోటితత్వాన్ని, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. అదే విధంగా టాస్క్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని, త్వరలో జిల్లా కేంద్రంలో టాస్క్ సెంటర్ ను ప్రారంభించుకుంటామని అన్నారు.

రాష్ట్రంలో ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా… సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడం కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాలమూరు జిల్లా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కావడం వల్ల రానున్న రోజుల్లో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక విభాగాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

- Advertisement -

అంతేకాక స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆలోచన కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నాటికి పాలమూరు యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా సాంకేతికపరమైన ఇంకూటేషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇక్కడ ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటుతో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50వేలు ఉద్యోగాలు కల్పించిందని, గత ప్రభుత్వ పాలనలో పదివేల ఉద్యోగాలు కూడా రాలేదని వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఆడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ , మున్సిపల్ చైర్మన్ ఆనంద్, వైస్ చైర్మన్ షబ్బీర్, మార్కెట్ చైర్మన్ అనిత, వైస్ చైర్మన్ విజయకుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement