Tuesday, November 19, 2024

Breaking: రోడ్డు కోసం స్టూడెంట్స్​ ధర్నా.. రాస్తారోకోతో స్తంభించిన రాకపోకలు

గణపురం (ప్రభ న్యూస్): స్కూల్​కు వెళ్లే దారి సరిగా లేదని, బురద మయంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో టీఎస్ మోడల్ స్కూల్​కు వెళ్లే రోడ్డు సరిగా లేదు. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులకు, లీడర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని రాస్తారొకో చేపట్టారు.

అధికారుల తీరుపై ఆగ్రహించిన మోడల్ పాఠశాల విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం పరకాల ములుగు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే. ఉన్నతాధికారులు వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని విద్యార్థులు భీష్మించుకు కూర్చున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement