Friday, November 22, 2024

ఉక్రెయిన్ నుంచి క్షేమంగా వచ్చిన నర్సంపేట విద్యార్థులు

రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న అంతర్ యుద్ధం కారణంగా అక్కడ ఉన్నత చదువుల కొసం వెళ్లిన భారతీయులను వారి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రుల, బంధువుల నుండి వస్తున్న విజ్ఞప్తులతో స్పందించిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సదర్శన్ రెడ్డి..   నియోజకవర్గానికి చెందిన పలువురు విద్యార్థులను సురక్షితంగా తీసుకొచేందుకు ప్రయత్నించారు. విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ధైర్యం చెప్పి తప్పకుండా క్షేమంగా స్వదేశానికి చేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పదించిన కేటీఆర్.. వెంటనే భారత ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు స్వస్థలకు చేరారు. దీంతో తమ పిల్లలను ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నుండి క్షేమంగా రావడానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement