సొంతింటి కల నెరవేర్చుకుందామనుకున్న ఆ కుటుంబానికి కన్నీళ్లే మిగిలాయి. కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టేందుకు ఓ బిల్డర్‌కు అప్పజెప్తే.. అతడు నిండా ముంచేశాడు. ఏం చేయాలో తెలియక న్యాయం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తే.. వారు కనీసం పట్టించుకోలేదు. ఫలితంగా ఆ కుటుంబంలో తీరని శోకానికి కారణమయ్యారు. ఈ విషాదకర సంఘటన మల్కాజిగిరిలో నియోజకవర్గం అల్వాల్‌లో జరిగింది.
సాయిరెడ్డి నగర్ కాలనీ మచ్చబొల్లారానికి చెందిన సుగుణవల్లి అనే యువతి ఫిజయోథెరపీ థర్డ్ ఇయర్ చదువుతోంది. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో తన కుటుంబం, తాను సంపాదించిన డబ్బును.. స్థానికంగా ఉండే ఓ బిల్డర్‌కు అప్పగించింది. రూ.5.30 లక్షలకు ఒప్పందం కుదిరింది. అందులో రూ. 4.30 లక్షలు చెల్లించింది. అయితే నెలలు, ఏడాది గడిచిపోయినా ఆ బిల్డర్ ఇంటిని పూర్తి చేయలేదు. డోర్లు, బాత్‌రూం, ఎలక్ట్రిసిటీ వంటి పనులేవి చేయకుండా వదిలేశాడు. దీంతో స్థానిక కార్పొరేటర్ జితేందర్ రెడ్డికి అనేకసార్లు ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. ఆయన పట్టించుకోకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దృష్టికి తీసుకెళ్లారు. తమకు న్యాయ చేయాలంటూ సుగుణవల్లి తల్లి ఎమ్మెల్యే కోరారు. కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. మేస్రీకి డబ్బులు ఇస్తే.. అతనే కంప్లీట్ చేస్తాడని, కూర్చుని మాట్లాడుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో న్యాయం చేసేవారు లేక.. ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియక సుగుణవల్లి మనస్తాపంతో గత నెల 18న ఆత్మహత్య చేసుకుంది. సమస్యపై పోలీసులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోలని బాధిత యువతి తల్లి కన్నీటి పర్యవంతమైంది. ఫిజయోథెరపీ డాక్టర్ కావాల్సిన ఆ ఇంటి అమ్మాయి.. అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదం నింపింది.
ఇది చదవండి: భారత్‌లో 5జీ ట్రయల్స్‌కు మార్గం సుగమం