Friday, November 22, 2024

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు

ప్రభన్యూస్ బ్యూరో, ఉమ్మడి కరీంనగర్) : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల రాక్షసంగా వ్యవ వారించాడు. 8వ తరగతి పాఠశాల గదిలోకి ప్రవేశించి గదికి బేడం వేసి చేతి కర్రతో విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా బాలికలను చూడకుండా వారిపై చేయి చేసుకోవడమే కాకుండా రాయడానికి వీలులేని పదజాలంతో దూశించడంతో విద్యార్థుల ఆర్థనాదాలు తరగతి గదిలో ఏమో జరుగుతుందన్న విషయం తోటి ఉపాధ్యాయులకు తెలిసింది. వారు అక్కడికి వచ్చి తూముల తిరుపతి రెడ్డి అనే ఉపాధ్యాయున్ని శాంతిచమని చెప్పినా వినలేదు. ఇదే తరగతికి చెందిన సాత్విక్ తోపాటు కిసాన్ నగర్ కు చెందిన పుల్లం పూజిత తన తండ్రి ఉల్లేం శ్రీనివాస్ కు ఫోన్ ద్వారా తెలపడంతో ని ద్యార్థుల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనతో పాఠశాల ఆవరణలో ఉద్రిక్త పరిస్తితులు చొ ు చేసుకున్నాయి.

ఏబివిపి విద్యార్థి సంఘం నాయకులు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. స్థానిక కార్పోరేటర్ ఎడ్ల సరిత-అశోక్ లు బాలిక విద్యార్థులకు అండగా నిలిచారు. విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేయడంతోపాటు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఏర్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కబెట్టారు.

ఈ సందర్భంగా గాయపడ్డ విద్యార్థులు తమ చేతికి, మెడకు, కాళ్లకు అయినటువంటి గాయాలను చూపించారు. మొత్తంగా 25 మంది విద్యార్థులు గాయపడిన వారిలో ఉండగా అందులో ఒకరి చేయి విరిగింది. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయునిపై లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు

- Advertisement -

. 8వ తరగతి క్లాస్ కు సంబంధం లేకున్నా తరగతి గదిలోకి ప్రవేశించి ఉపాధ్యాయుడు శాడిస్ట్ గా వ్యవహరించినతీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉపాధ్యాయుడు ఈ సంఘటనకు పాల్పడుతున్న సందర్భంగా కొందరు ఎదురు తిరిగే ప్రయత్నం చేయగా వారిపై కూడా చేయి చేసుకొని బూతు పదజాలాన్ని ఉపయోగించినట్లు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆంధ్రప్రభకు తెలిపారు. విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయ సంఘానికి నాయకుడు కూడా ఇతను ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదని చాలా సందర్భాల్లో విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించాడని విద్యార్థులు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement