Friday, November 22, 2024

TS : చికిత్స పొందుతూ విద్యార్థినీ మృతి… విద్యార్థుల ఆందోళ‌న‌

భద్రాచలం పట్టణంలో పారామెడికల్ కళాశాల విద్యార్థిని కారుణ్య చికిత్సపొందుతూ మృతి చెందింది. దీంతో భద్రాచలంలోని పారామెడికల్‌ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల చైర్మన్ పై విద్యార్థి సంఘాలు ప్రతినిధులు దాడికి పాల్పడ్డారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యాసంఘాలు ఆందోళన చేపట్టాయి.

- Advertisement -

గురువారం ఉదయం కళాశాల ప్రాంగణంలో గాయాలతో పడి అపస్మారకస్థితిలో నర్సింగ్‌ విద్యార్థిని కారుణ్యను విద్యార్థులు గుర్తించారు. అనంతరం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి కారుణ్యను కళాశాల యాజమాన్యం తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం కారుణ్య ఆమె మరణించింది.

విద్యార్థిని మృతితో పారామెడికల్ కళాశాల వద్ద బంధువులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రి నుంచి విద్యార్థులతో కలిసి ర్యాలీగా కళాశాల వద్దకు వచ్చారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల డిమాండ్‌ చేస్తున్నారు. కళాశాలకు వచ్చిన ఛైర్మన్‌పై విద్యార్థులు, బంధువులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ ఘటనలో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కారుణ్య మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేకు చేదు అనుభవం..

కారుణ్య మృతి నేపథ్యంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాలేజీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు.  దీంతో కారుణ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. నిందితుల తరఫున ఇక్కడకు వచ్చారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కారుణ్య బంధువులకు నచ్చచెప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించారు. కానీ వారు వినకపోవడంతో ఆయన వెనుదిరిగారు.

నర్సింగ్ విద్యార్థిని కారుణ్య గురువారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కాలేజీ ప్రాంగణంలో ఆమె గాయాలతో పడి ఉన్నారు. దీంతో యాజమాన్యం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. కారుణ్య చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందింది. దీంతో ఈరోజు ఆమె బంధువులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చి కళాశాల వద్ద నిరసన తెలిపారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement